📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు తెలంగాణకు భారీ పెట్టుబడులు వైద్య సిబ్బంది నియామకం ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త

KTR complaint Governo : సింగరేణి కుంభకోణం? గవర్నర్‌కు కేటీఆర్ ఫిర్యాదు!

Author Icon By Sai Kiran
Updated: January 27, 2026 • 7:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

KTR complaint Governo : సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై వినతిపత్రం సమర్పించింది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

సింగరేణిలో జరిగిన అవకతవకలను ఆధారాలతో బయటపెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఫుట్‌బాల్ ఆట పేరుతో సింగరేణి నిధుల నుంచి రూ.10 కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. సింగరేణి టెండర్లలో పూర్తిగా పారదర్శకత లేకపోయిందని, ఈ అంశంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read Also:Telangana: ఫ్లాగ్ హోస్టింగ్ సమయంలో అపశృతి

సింగరేణి వ్యవహారంలో కీలక వ్యక్తిగా చెబుతున్న (KTR complaint Governo) సృజన్ రెడ్డి ముఖ్యమంత్రికి బావమరిదేనా కాదా స్పష్టత ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి గురించి సింగరేణి కార్మికులు ‘కోల్ మాఫియా నాయకుడు’గా భావించే పరిస్థితి వచ్చిందని తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి కుంభకోణాన్ని అడ్డుకుని న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు.

KTR complaint Governor

ఇదే సందర్భంలో హిల్ట్ పాలసీపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడల్లో ఉన్న సుమారు రూ.5 లక్షల కోట్ల విలువైన 9,200 ఎకరాల భూములను కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకునే ఇలాంటి చర్యలను తక్షణమే అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu BRS KTR allegations CBI probe Singareni coal scam Telangana Google News in Telugu HILT policy allegations KTR complaint Governor Latest News in Telugu Political News Telangana Revanth Reddy government Singareni coal scam Singareni tenders transparency Telangana politics news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.