📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు: కేటీఆర్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: January 7, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని మండిపడ్డారు. తెలంగాణలో అర్థ గ్యారెంటీ అమలు, మిగతా గ్యారెంటీలకు అరవై షరతులు అని ఎద్దేవా చేశారు. అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అమలవుతున్నది ఒకే ఒక్క గ్యారంటీ.. అది మోసం అంటూ ఫైరయ్యారు. తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి సంబంధించిన నిరసన సెగ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి తాకిందని చెప్పారు. రైతు డిక్లరేషన్‌ను ఎలా అమలుచేస్తున్నారో వివరించేందుకు తెలంగాణకు ఎందుకు రావడం లేదని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు.

image

రైతు భరోసాపై తెలంగాణ రైతాంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేసిందని పేర్కొంటూ ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం గేటుకు గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ సందర్భంగా రైతు భరోసాగా ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారని, ఇప్పుడు దానిపై కాంగ్రెస్‌ యూ టర్న్‌ తీసుకున్నదని పేర్కొన్నారు. 2024లో రైతులకు పెట్టుబడి సాయంగా విడుదల చేసింది గుండు సున్నానే అంటూ రాశారు. ఎకరాకు రూ.12 వేలు ఇస్తామంటూ రూ.15 వేలపై సీఎం రేవంత్‌ రెడ్డి యూ టర్న్‌ తీసుకున్నారని పోస్టర్లలో తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అంటేనే కన్నింగ్‌ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

brs CM Revanth Reddy congress ktr Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.