📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

ఆటోడ్రైవ‌ర్ల‌కు రూ.12వేల సాయం ఏమైంది: కేటీఆర్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: December 21, 2024 • 11:02 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్‌ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సిద్దిపేట‌లో అప్పుల బాధ‌తో ఓ ఆటో డ్రైవ‌ర్ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ వార్త‌ను ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్) వేదిక‌గా ‘ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు?’ అంటూ కేటీఆర్ షేర్ చేశారు. ఆటోడ్రైవ‌ర్ల‌కు ఇస్తాన‌న్న రూ.12వేల సాయం ఏమైంద‌ని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిల‌దీశారు. ఆటో డ్రైవ‌ర్ల‌తో పాటు అన్ని వ‌ర్గాల‌ను మోస‌గించార‌ని ఆయ‌న‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు. ఇదే ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు!” అని కేటీఆర్ అన్నారు. “ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో ధ‌గ ధ‌గ మెరిసిన చేతుల్లోకి పురుగు మందు డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న రూ. 12వేల సాయమేది? రాహుల్ గాంధీ.. ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను సీఎం మోసగించారు..అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

కాగా, హైదరాబాద్‌లో కేటీఆర్‌ను ఆటోవాలాలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి తమ పక్షాన కాంగ్రెస్‌ ప్రభుత్వంతో కొట్లాడుతున్నందుకు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 100 మందికిపైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇకపై ఎవరూ అలాంటి పనులు చేయొద్దని భరోసానిచ్చారు. మీ సమస్యలపై పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Autodrivers brs CM Revanth Reddy congress ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.