📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

BRS Merge with BJP : సీఎం రమేష్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం

Author Icon By Sudheer
Updated: July 26, 2025 • 9:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఎక్కడా చూడనంత దౌర్భాగ్యమైన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలోనే జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ నాయకుడు సీఎం రమేశ్‌కు రాష్ట్రంలోనే రూ. 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ దక్కిందని, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి బంధువు అయిన ఆయన బావమరిదికి కేంద్రంలోని బీజేపీ సర్కారులో రూ. 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది బీజేపీ–కాంగ్రెస్ పొత్తుని బట్టబయలు చేస్తోందని, ఇది దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు.

1660 కోట్ల రోడ్ స్కాం – HCU భూముల దోపిడి

కేటీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు కోసం రోడ్డుల పేరుతో 1660 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించబడ్డాయన్నారు. అంతేకాక హెచ్సీయూ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న స్కాంలోనూ ఈ రెండు పార్టీల నాయకులు పాత్ర వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బు సంపాదించేందుకు సీఎం రమేశ్‌కు రిటర్న్ గిఫ్ట్‌గా రోడ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు తేలిపోయిందని చెప్పారు. ఈ విషయాలు ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న పుకార్లను మళ్లీ తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ బలంగా ఉంది – విలీన వార్తలు అవాస్తవం

తెలంగాణ ప్రజల కోసం స్థాపించబడిన బీఆర్ఎస్ పార్టీ, ఎప్పటికీ ఇతర పార్టీల్లో విలీనం కానందని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ అని, కాంగ్రెస్ – బీజేపీ మద్దతుదారులు ప్రతిసారి ఇరకాటంలో పడినప్పుడు బీఆర్ఎస్ విలీన వార్తలు రాస్తూ ప్రజలను దారితప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం రమేశ్ – సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి వచ్చి, హెచ్సీయూ భూముల 10,000 కోట్ల స్కాం, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాలు విసిరారు.

Read Also : Asia Cup : ఆసియా కప్ వేదిక ఖరారు టోర్నీ ఎప్పుడంటే?

BRS merge with bjp cm ramesh ktr

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.