📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ

Krishna Rao: పార్టీ ఉనికి కోసమే ఫామ్ హౌసు బయటకు వచ్చిన కెసిఆర్

Author Icon By Tejaswini Y
Updated: December 23, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్, డిసెంబరు 22, ప్రభాతవార్త: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే బిఆర్ఎస్ పార్టీ కండలు కరిగి తోలు మాత్రమే మిగిలినదనిపిస్తోందని పర్యాటక సాంస్కృ తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Krishna Rao) అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ మూడింట ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేక పోయింది..

ఆ పార్టీ బలహీనపడింది, దాని ప్రతిష్ట దిగ జారింది, కెటిఆర్(K. T. Rama Rao), పారిశ్రవు ఆ పార్టీని కాపాడు రోజురోజుకూ దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడానికి కెసిఆర్(K. Chandrashekar Rao) ఫామ్ హౌసు వదిలి బయటకు వచ్చారే తప్ప పాలమూరు ప్రాజెక్ట్లపై ప్రేమ కాదని అపహాస్యం చేశారు. బిఆర్ఎస్ పార్టీని ఉనికికాపాడుకొనేందుకు ఫామ్ హౌసు బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Read also: E-commerce Insights: ఏకకాలంలో కండోమ్ ఆర్డర్లకు చెన్నై వ్యక్తి చేసిన పెద్ద ఖర్చు

Jupally Krishna Rao

రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్లను గత కెసిఆర్ సర్కార్ నిరక్ష్యం చేసిందని ఆరోపించారు. ఒక్కఎకరానికి కూడా నీరు అందించలేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేసిన ఘనత కెసిఆరే అని ఆయన అన్నారు. నార్లాపూర్ ఏదుల్ల రిజర్వాయర్లకు నీరు అందించే కాలువలు కూడా. పూర్తిచేయలేదని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోని పరిస్థితి అని అన్నారు. పది ఏండ్లలో ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీది అని ఆరోపించారు. పదేండ్ల పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల ను పూర్తి చేయలేని మీకు ఉన్నట్టుండి ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నారని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు బిజెపి కేంద్ర ప్రభుత్వంతో అంటకాగి ఏనాడు తెలంగాణ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడలేదని విమర్శించారు. బిజెపితో సఖ్యత ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయో జనాలను కాపాడడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్తో అంటకాగి రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తామని చెప్పింది మీరు కాదా? కృష్ణ నదీ జలాల్లో తెలంగాణ నీటి వాటాను వదులుకుంది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను కాపాడుకునే అవకాశం ఉన్న ఏనాడు బిజెపి కేంద్ర(BJP Center) ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోయారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడం లేదు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతోందనీ అవేదన చెందారు. తెలం గాణ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేదని చెప్పారు. డిమాండ్కు అనుగుణంగా యూరియా కేటాయింపులు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

read also:

BRS party congress party jupally krishna rao KCR ktr local body elections Palamuru Projects Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.