అమరావతి: వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈనేపథ్యంలో.. మంగళవారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలుకు చేరుకొని పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెళ్లారు.
జడ్జి ఆదేశాల మేరకు ఆయనను గుంటూరు జిల్లా
మొదట పోసాని రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత నరసరావుపేట కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని… తనను నరసరావుపేట జైల్లో కాకుండా గుంటూరు జైలుకు తరలించాలని పోసాని కోరడంతో జడ్జి అంగీకరించారు. జడ్జి ఆదేశాల మేరకు ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఇప్పడు ఆదోని పోలీసులు ఆయనను ఆదోనికి తరలిస్తున్నారు.
సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లపై జుగుప్సాకర విమర్శలు చేసిన సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విచారణ పరంపర కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో ఆయన్ని హాజరుపరిచేందుకు అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్‌పై సోమవారం తరలించారు. నరసరావుపేట టూటౌన్ పరిధిలో నమోదైన కేసులో ఆయనను నరసరావుపేట మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రాత్రి 7.15 సమయంలో హాజరు పరిచారు.