📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Krishna River: కృష్ణా, గోదావరి పొంగుతున్నా..అలుగుపారని చెరువులు

Author Icon By Sharanya
Updated: July 22, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: గోదావరి కృష్ణా నదులలో ఉద్భత ప్రవాహం ఉన్నప్పటికి అలుగు పారని చెరువులతో ఆశలు అడుగంటుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల (Krishna River) నుంచి ఇప్పటికే వేల టిఎంసిల నీరు సంద్రం పాలవుతున్నాయి. కృష్ణాగోదావరి ఉరకలెత్తుతం టే మరోవైపు బేసిన్లోని చెరువులు చూస్తే ఆశించిన రీతిలో నీరు లేక వెలవెలపోతున్నాయి. తెలంగాణ (Telangana) అంతటా వర్షాభావం కొనసాగుతుండటంతో అన్నదాతలలో నైరాశ్యం నెలకొంది. బోర్లపై సాగు చేస్తుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో సగటునా నీరు కూడా నిండలేదు

మహబూబాబాద్, కామారెడ్డి, వికరాబాద్, నల్లగొండ, రాజన్నసిరిసిల్ల, హైదరబాద్, వరంగల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గరి, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, సూర్యపేట, నిర్మల్, ములుగు, జనగాం, సంగారెడ్డి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో నేటికి లోటు వర్షాపాతం ఉండటంతో అక్కడ చెరువుల్లో పదిశాతం మించి కూడా కొత్త నీరు చేరలేదు (No new water is added). యాదాద్రి భువనగిరి, కుమురంభీం జిల్లాలో సాధారణ వర్షాపాతం నమోదైనా 15శాతం కొత్త నీరు చెరువుల్లోకి వచ్చి చేరలేదు. భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం జిల్లా నుంచి గోదావరి ఉరకలై పరుగులు పెడుతున్నా స్థానికంగా చెరువులు కుంటలలో ఆశించిన నీరు చేరుకోలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 44వేల చెరువుల్లో సగటునా 17శాతం నీరు కూడా నిండలేదు. సాగు కాలం దాటుతున్నా చెరువులు, కుంటల్లో నీరు లేక పంటల సాగు సందేహంగా మారింది. లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన పంటలు వందల ఎకరాల్లోనూ సాగవలేదు. గోదావరి కృష్ణా బేసిన్ లోని అనేక గ్రామాల్లో చెరువులు జలం లేక ఎండి నెర్రలువాచాయి. ఎస్సారెస్పీ. కాళేశ్వరం ప్రాజెక్టుల నుంచి నీరు రాకున్నావాటి దిగువ నుంచి ప్రవహించే నీటితో దేవాదుల ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకోవచ్చు.

దేవాదుల, ప్రాజెక్టు మూడో దశలో నిలిచిన అసంపూర్తి పనులు పూర్తిచేస్తే 38 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడంతోపాటు, ఆ నీటిని చెరువులకు మళ్లించాలని రైతులు కోరుతున్నారు. ఐనాపూర్ శివారులోని తపాసుపల్లి జలాశయం నుంచి గత ఎనిమి సంవత్సరాలుగా నీటిని కాలువలు, గొట్టాపు మార్గాల ద్వారా తరలించి చెరువులు నింపడంతో చేర్యాల సబ్ డివిజన్లో భూగర్భజల మట్టం పెరిగింది. ఎండిపోయిన వ్యవసాయ బావుల్లో నీట ఊటలు పుట్టుకొచ్చాయి. ఈ ఏడాదిలో గత వారం కేవలం రెండు రోజులు మాత్రమే గోదావరి ఎత్తిపోయించారు. ఆ తర్వాత నిలిపేశారు. రైతులు నాట్ల కోసం వరి నారు పోసి సాగునీటికి ఎదురుచూస్తున్నారు. దీంతో గోదావరి జలాలతో తపాసుపల్లి రిజర్వాయరు నింపి చెరువుల్లోకి తరలించాల్సిన అవసరం పెరిగింది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఏటూరానాగారం వద్ద గోదావరి నీటిని గొట్టాల ద్వారా తపానుపల్లి జలాశయంలోకి ఎత్తిపోసి అక్కడి నుంచి నిరుటి వరకు చెరువుల్లోకి తరలించారు. అలా గతంలో చేర్యాల, కొండపాక, కొమురవెల్లి, ధూల్మిట్ట, మద్దూరు, జనగామ జిల్లా బచ్చన్నపేట మండలాల్లో సుమారు 50 చెరువులకు పైగా నింపేవారు. ఇవుడు ఆపరిస్థితి లేదు. ఇటు వర్షాభావ పరిస్థితులు, గోదావరి జలాల తరలింపు ఆలస్యంతోచెరువులు నిండుకున్నాయి. నీటి గుంతల్లా దర్శనమిస్తున్నాయి. దీంతో 50 వేల ఎకరాల ఆయకట్టు సాగు పరిస్థితి దయనీయంగా మారింది. తాగునీటికి సైతం ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. లక్నవరంలో 12 అడుగులలో నీరు ఉంది. రామప్ప, గణపసముద్రం, బయ్యారం పెద్దచెరువు, పాకలసరస్సు, మైలారం రిజర్వాయర్ నీటి మట్టం తక్కువగా ఉంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో నీటిజాడలు కానరావడం లేదు.

ఎస్సారెస్సీలో 21 టిఎంసిలు నీరు

ఎస్సారెస్సీలో 21 టిఎంసిలు మాత్రమే నీరు ఉండటంతో ఉత్తర తెలంగాణలో చెరువులు నింపలేదని పరిస్థితి ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తేనే నిజాంసాగర్ జలాశయం ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. ఇటీవల నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణ ప్రజల తాగు అవసరాలకు నీటిని విడుదల చేయడంతో నిల్వలు తగ్గుముఖం పట్టాయి. జలాశయంలో ఉన్న కొద్దిపాటి నీటిని 149 డిస్ట్రిబ్యూటర్ అలీసాగర్ ఎత్తిపోతల పథకం వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందించడంతో రైతులు వరితోపాటు ఇతర పంటలు వేస్తున్నారు. నిజామ్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు అందులో 17.802 టీఎంసీల నిల్వ సామర్థం ఉంది. ప్రస్తుతం 1391 అడుగుల ఎత్తులో 4.703 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. జలాశయం నుంచి నిజామాబాద్, బోధన్ పట్టణ ప్రజల తాగునీటి కోసం జూన్ 18 నుంచి 25వ తేదీ వరకు 0.75 టీఎంసీలు, వానాకాలం వంటలకు ఇప్పటివరకు 0.72 టీఎంసీలను విడుదల చేశారు. పంటల సాగుకు ప్రస్తుతం రెండోసారి 1200 క్యూసెక్కుల నీటిని అధికారులు వారబందీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఎగువన వర్షాలు కురవకపోతే నిజామ్సాగర్ నుంచి ఆయకట్టుకు మరో రెండు విడతలు మాత్రమే నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. కొండపోచమ్మ నుంచి వయా హల్దీవాగుతో నిజామ్సాగర్ నీరు తరలించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో అవకాశం ఉన్నా గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో ఉపయోగించడానికి ప్రస్తుత పాలకులు వాడుకొంటున్నారు. దీనితో రైతులకుఇబ్బంది కలుగుతోంది.

భూగర్భ జలాల లభ్యత 10.41 మీటర్లు

నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో భూగర్భ జలాల లభ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, చిన్న, మధ్యతరహా నీటివనరులలో నీరు లేకుండా పోయింది. యాదాద్రిలో పరిస్థితి తీవ్రంగా ఉంది. యాదాద్రి జిల్లాలో గతేడాది జూన్లో భూగర్భ జలాల లభ్యత 10.41 మీటర్లు ఉండగా. ఈ ఏడాది జూన్లో 12.22మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం సాగునీటి విడుదల లేకపోవడంతో.. పంటల సాగు కోసం బోర్లు, మోటార్లను ఆశ్రయించాల్సి రావడంతో జలాలు మరింత లోతుకు పడిపోయే ప్రమాదముందని నిపుణులు భావిస్తున్నారు. జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 1 నుంచి జులై 15 వరకు అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 47 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. నల్గొండలో 37శాతం, యాదాద్రిలో 36 శాతం తక్కువగా నమోదైంది. యాదాద్రి జిల్లాలో భువనగిరిలో 65 శాతం, బీబీనగర్, గుండాలలో 62శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లా నారాయణపురం మండలంలో సాధారణం కంటే 71 శాతం అదనంగా వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లాలో వర్షాభావం పెరిగిన ఊష్ణోగ్రత కారణంగా వ్యవసాయంతోపాటు గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం పెరిగింది. జిల్లాలో 77 వేల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. జులైలో ప్రతి రోజు 5.8 మిలియన్ యూనిట్ల విద్యుత్తు డిమాండ్ లక్ష ్యం ఉంది. గత ఆరు రోజుల వినియోగం పరిశీలిస్తే డిమాండ్కు సమీపిస్తోంది. 14 జూలైన జిల్లాలో 5.07 మిలియన్ యూనిట్లు వాడారు. వర్షాలు లేకపోవడం, బోర్ల నీటిని వినియోగించడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇలానే ఉంటే విద్యుత్తు కోతల ప్రమాదం పొంచి ఉండనుంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: Adulterated liquor: కల్తీ మద్యం తయారీ ముఠా గుట్టురట్టు

Agriculture and Water Breaking News Godavari River irrigation issues Krishna River latest news Telugu News Water Crisis

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.