Cpi mayor race : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు తీసుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీపీఐకి మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కొత్తగూడెంలో సీపీఐ అత్యధిక స్థానాలు గెలుచుకున్నందున, “మీరు గెలిచారు కాబట్టి మద్దతు ఇస్తాం” అని కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి తెలిపారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ఇది రాజకీయంగా కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: నీటి సమస్యలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం
మేయర్ పదవిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని కూనంనేని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే మంచి అవకాశం ఇది అని, తమ హక్కును వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఎవరి మద్దతైనా స్వాగతమే కానీ మేయర్ పదవి విషయంలో రాజీ ఉండదని తెలిపారు.
బీఆర్ఎస్‌తో పాటు కొంతమంది స్వతంత్ర సభ్యులు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారని చెప్పారు. పొత్తులు, తదుపరి వ్యూహంపై పార్టీ అంతర్గతంగా చర్చించి రెండు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: