Korutla News: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో గత రాత్రి తీవ్ర కలకలం రేగింది. బురఖా ధరించి బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని ప్రయాణికులు గుర్తించి పట్టుకున్నారు.
Read Also: Kathanpalli: మంచిర్యాల లో బంద్ ఉద్రిక్తత – బీఆర్ఎస్, సీపీఐ ఆందోళనలు
ప్రయాణికుల చాకచక్యం
రాత్రి సుమారు 8 గంటల సమయంలో, బురఖా వేసుకున్న ఒక వ్యక్తి బస్టాండ్‌లో మహిళలు కూర్చున్న ప్రదేశంలో వారితో పాటు కూర్చున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు ప్రయాణికులు గమనించారు. ఆ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతుండగా అతని గొంతు మగవారిలా ఉండటంతో, అతను పురుషుడని ప్రయాణికులు నిర్ధారించుకున్నారు.
సెక్యూరిటీ సిబ్బంది అదుపులో..
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్టాండ్ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బురఖా వేసుకుని బస్టాండ్‌లోకి ఎందుకు వచ్చాడనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: