తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల వరంగల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారని ఆమె చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధంగా మారాయి, పార్టీకూ చెదరగొట్టే అంశంగా మారాయి.
నేను డబ్బులు తీసుకోను, సేవే నా లక్ష్యం
వరంగల్ లో ఒక కార్యక్రమంలో కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యలు వరంగల్ లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఐదు కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించ తలపెట్టిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్ వస్తుంటాయని, అటవీ శాఖ మంత్రిని కావడంతో తన అనుమతుల కోసం ఎన్నో ఫైల్స్ వస్తాయని కొండా సురేఖ పేర్కొన్నారు. ఒక కంపెనీ ఫైల్ ఆమోదం కోసం తనను సంప్రదించినప్పుడు, ఆ కంపెనీకి కాలేజీ భవనం నిర్మించాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆ కంపెనీ రూ.4.5 కోట్ల వ్యయంతో భవన నిర్మాణానికి ముందుకు వచ్చిందని, ఇది తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు.
మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారు వ్యాఖ్యల దుమారం
మంత్రులు ఇలాంటి ఫైళ్లను క్లియర్ చేయడానికి డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం ఒక్క నయాపైసా కూడా ఇవ్వొద్దని, దానికి బదులుగా పాఠశాల నిర్మాణం వంటి సామాజిక సేవ చేయాలని వారికి చెబుతున్నాను అని వ్యాఖ్యానించారు. .
విమర్శలపై కౌంటర్
కావాలని చేస్తున్న కుట్ర తన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరిస్తున్నారని, నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనుకను కట్ చేసి చిన్న చిన్న క్లిప్పులు చేసి ట్రోల్ చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. మా క్యాబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, పనిచేస్తున్న మంత్రుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని కొండా సురేఖ హెచ్చరించారు. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని దాని వరంగల్ (Warangal) లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి ఫైలు క్లియర్ చేయడం కోసం ఎన్ని డబ్బులు తీసుకున్నారో వారందరికీ తెలుసని కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు .
బీఆర్ఎస్‌కు సవాల్
గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలోని మంత్రులు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునేవారని నేను అన్నాను. ఆ ప్రభుత్వ మంత్రుల పనితీరును ఉద్దేశించే నేను ఆ వ్యాఖ్యలు చేశాను అని సురేఖ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని, ఈ అంశంపై త్వరలో వీడియో ద్వారా మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు పూర్తిగా వక్రీకరించారని ఆమె ఆరోపించారు.
Read also: Rythu Bharosa : ఈనెల 23 తర్వాత రైతుల ఖాతాల్లోకి డబ్బులు?