📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Konda Surekha: హరిణ వనస్థలి పార్క్లో అనన్య రిసార్ట్ నిర్వహణ అస్తవ్యస్తం

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీ

Konda Surekha: మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్లోని అనన్య రిసార్ట్ ను రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసార్ట్ నిర్వహణలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని పిర్యాదులు రావడంతో అధికారులతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. రిసార్ట్లో సందర్శకులకు కనీస వసతులు కూడా సక్రమంగా అందించడం లేదని గుర్తించి నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్, స్విమ్మింగ్ పూల్, కాటేజీలు, కిచెన్ తదితర విభాగాల్లో నిర్వహణ చాలా నిరక్ష్యంగా ఉందని మండిపడ్డారు.

Read Also: Seethakka: రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన కేంద్ర నిధులను సాధించాలి

Konda Surekha: The management of Ananya Resort in Harinavanasthali Park is in disarray.

నిర్వహణలో లోపాలు

పర్యాటకులు, కుటుంబాలతో వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు రిసార్టులో ఉండటం ఆందోళనకరమన్నారు. పదేళ్లుగా ఈ రిసార్టు ఒక ప్రైవేట్ సంస్థ లీజ్ కు తీసుకుని నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో తీవ్ర నిరక్ష్యం వహించిందని మండిపడ్డారు. ఈ కాలంలో ప్రభుత్వానికి కేవలం ఒక్కసారి మాత్రమే పన్నులు చెల్లించినట్టు తనిఖీలో వెల్లడైందని పేర్కొన్నారు. అదేవిధంగా రిసార్ట్లో బుకింగ్స్ ను సరైన బిల్లులు ఇవ్వకుండా నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించామని మంత్రి తెలిపారు.

బిల్స్ లేకుండా బుకింగ్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం వాటిల్లు తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దాచిపెట్టే విధంగా కార్యకలాపాలు నిర్వహించడం పరిగణించాల్సిన అంశమని అన్నారు. రిసార్ట్లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా సరైన విధంగా జీతాలు చెల్లించడం లేదని, అకౌంట్ పే ద్వారా కాకుండా ఇతర విధానాల్లో చెల్లింపులు జరుగుతున్నట్టు తనిఖీలో తేలిందని వారికి పీఎఫ్ వంటి బీమా సౌకర్యాలు కూడా కల్పించలేదని ఇది కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు.

నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు

ఇక అటవీ ప్రాంతంలో నిర్వహించే ఎకో టూరిజం కార్యకలాపాలు ప్రకృతి పరిరక్షణకు అనుగుణంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. వాణిజ్య జాతీయ పార్క్ పరిధిలో జరిగే కార్యకలాపాలు పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు అనుగుణంగా ఉండాలి తప్ప ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయకూడదని తెలిపారు. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల్లో ప్రైవేట్ సంస్థ వద్ద ఉన్న రిసార్ట్ నిర్వహణను పూర్తిగా రద్దు చేసి, అటవీశాఖ స్వాధీనం చేసుకునే చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

అనంతరం ఈ ప్రాంతాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి, ఎకో టూరిజం ప్రమాణాలకు అను గుణంగా మెరుగైన సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. తనిఖీల్లో మంత్రి వెంట సిసిఎఫ్ ప్రియాంకవర్గీస్, రంగారెడ్డి డిఎఫి రోహిత్, ఎఫ్ఒ వెంకటయ్య, సాయి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Ananya Resort Forest Department Harina Vanasthali Park KONDA SUREKHA TG

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.