తెలంగాణ(Telangana) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy) మహిళా అధికారులు పై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. మీడియా తనపై ఏవైనా కథనాలు రాసినప్పటికీ, అవన్నీ తట్టుకుంటానని అన్నారు, అయితే మహిళా ఐఏఎస్ అధికారులపై అనవసర కథనాలు రాయవద్దు అని స్పష్టమైన అభ్యర్థన చేశారు.
Read Also: Telangana: BRS హయాంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
సోషల్ మీడియా వల్ల మానసిక ఒత్తిడి
మంత్రికి అధికారులను బదిలీ చేసే హక్కు ముఖ్యమంత్రి వద్దే ఉందని, ఏవైనా తప్పుగా వార్తలు ప్రచారం చేయకూడదని గుర్తుచేశారు. తన కుమారుడిని కోల్పోయిన తర్వాత ప్రజాసేవలో ఫోకస్ పెంచి ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారన్నారు.
తప్పుగా ప్రచారం చేయబడే వార్తల కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నానని, సోషల్ మీడియా వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా రావచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చనిపోయిన తర్వాత రాజకీయాల్లో వ్యక్తిగత అనుభవాలను వదిలేస్తే బాగుంటుందనిపిస్తోందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: