📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Komare Reddy : విమానాశ్రయానికి ఉత్తర్వులు జారీ : కోమటిరెడ్డి

Author Icon By Divya Vani M
Updated: April 2, 2025 • 9:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరొక శుభవార్త అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతి ఇచ్చేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో మరో విమానాశ్రయానికి భారత వాయుసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ ప్రజలతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకూ ఇది విశేషమైన వార్తగా మారిందని ఆయన తెలిపారు.ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు పొందిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.

Komare Reddy విమానాశ్రయానికి ఉత్తర్వులు జారీ కోమటిరెడ్డి

కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనమని మంత్రి వెంకటరెడ్డి పేర్కొన్నారు.ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాల రాకపోకలతో పాటు, ఎయిర్ ఫోర్స్ కార్యకలాపాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని భారత వాయుసేన సూచించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మేరకు అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (AAI) అప్పగించాలని సంబంధిత అధికారులకు లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్రం నుంచి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రానికి రావాలని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

AdilabadAirport AirportAuthorityOfIndia AviationNews CivilAviation KomatireddyVenkatReddy NarendraModi TelanganaDevelopment TelanganaNews

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.