హైదరాబాద్: వ్యవసాయ యాజమాన్య, విస్తరణ శిక్షణ సంస్థను మరింతగా బలోపేతానికి కృషి చేస్తానని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్లోని మలక్పేటలో సంస్థను రైతు కమిషన్ (Farmers Commission) పరిశీలించింది. ఈ సందర్భంగా రెండు గంటలపాటు వ్యవసాయ శిక్షణ సంస్థలో వివిధ విభాగాలపై కమిషన్ బృందం ఆరా తీసింది. అనంతరం వ్యవసాయ అధికారులకు, రైతులకు ఎంతగానో ఉపయోగపడే శిక్షణ సంస్థ నిరాదరణకు గురైందని అధికారులు దృష్టికి కమిషన్ తీసుకవచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1985 లో ఏర్సాటైందని, వ్యవసాయ రంగంలో మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులకు, ఆదర్శ రైతులకు సాగులో నూతన పద్దతులపై శిక్షణ ఇచ్చేవారని వివరించారు. చాలా సందర్భాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా సమెటికీ వచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారని, కానీ గత పదేండ్ల కాలంలో సమెటీ వైభవాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖయ్యింగా డీఎన్ఏ ఫింగరింట్స్, ఫర్టిలైజర్ కోడింగ్ సెంటర్, బయో ఫెస్టిసైడ్ ల్యాబ్(Bio Pesticide Lab), ఫెస్టిసైడ్ టెస్టింగ్ కోడింగ్ సెంటర్, లైబ్రరీలను తనీఖీ చేసింది. జన్యు మార్పిడి ఇష్యూస్, పత్తి, మొక్క జొన్న, పొద్దుతిరుగుడు, మిర్చి, వరి వంగడాల డిఎన్ఏ పరిశోధనలు ఎక్కువగా ఈ శిక్షణ సంస్థలో జరుగుతాయని కమిషన్కు తెలిపారు. అదేవిధంగా దేశంలోనే హెబ్డి కాటన్ను టెస్ట్ చేసి గుర్తించిన డిఎన్ఏ ల్యాబ్ గా పేరుందని, కానీ గత పదేండ్ల కాలంలో నిధులు, నియామకాలు లేక ఆగమైందని ఆరోపించారు. ప్రస్తుతం సమితి వున్న భవనం కూడా శిధిలా వ్యవస్థకు చేరింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించడానికి సమెటి అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇవ్వాలన్నారు. కమిషన్ మెంబర్ సెక్రెటరీ గోపాల్, సమెటి డైరెక్టర్ నర్సింహా రావు, ఎడిఏ సుధాకర్ బాబు, డిఎన్ఏ ల్యాబ్ ఇంచార్జి కవిత, బయోఫెస్టిసైడ్ ఇంచార్జి సంధ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్టిలైజర్ కోడింగ్ రమాదేవి, అగ్రికల్చర్ అధికారులు హరివెంకట ప్రసాద్, శ్రావణి తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: