హైదరాబాద్: తెలంగాణలో ఉద్యాన పంటల (Horticultural crops) సాగు పెరగాల్సిన అవసరం ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి (Kodanda Reddy) అన్నారు. ముఖ్యంగా కూరగాయల పంటల సాగు పెంచాలని చెప్పారు. రాష్ట్రానికి ప్రతీ రోజు లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు దిగుమతిని అవుతున్నాయని, వాటిని తగ్గించాలంటే రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు పెరగాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 60 మంది హర్టికల్చర్ అధికారులు
హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉద్యానవన శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంటల సాగు విస్తీర్ణం (Crop cultivation area) పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖలో ఉద్యోగుల కొరత, కూరగాయల సాగు చేసే రైతులకు ఎదురవుతున్న సమస్యలపై అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా ఉద్యానవన శాఖలో ఉద్యోగాల భర్తీ కాకపోవడం, పనిభారం పెరిగిన విషయాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది హర్టికల్చర్ అధికారులే ఉన్నారని దీంతో రైతులకు ఉద్యానవన పంటల సాగుపై అవగాహాన కల్పించ లేకపోతున్నట్లు తెలిపారు. మార్కెట్లు అందుబాటులో లేకపోవడం, ఉద్యానవన పంటల సాగులో ఆధునిక పద్ధతులు, యంత్ర పరికరాలు వినియోగించక పోవడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు వివరించారు. అలాగే ఎలాంటి నష్టం లేని పంట పట్టు పురుగుల సాగని, దీన్ని ప్రోత్సహిస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసమావేశంలో కమిషన్ సభ్యులు భవానిరెడ్డి, గంగాదర్, సిహెచ్ వెంకన్న, ఉద్యనశాఖ అధికారుల సందీప్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Andela Sriramulu Yadav: బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాల అనుమానాస్పద సంచారం