📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kishan Reddy: ప్రధాని మోడీ ఆదేశం మేరకే వచ్చా

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాధిత కుటుంబానికి బిజెపి అండ

మహాదేవప్ప కుటుంబాన్ని పరామర్శించమని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఆదేశించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థిగా 6వ వార్డు నుండి పోటీ చేసి బెదిరింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మహదేవప్ప విషయాన్ని తాను పార్లమెంటులో ప్రస్తావించినప్పుడు ప్రధాని ఈ విషయంపై ఆరా తీశారని గుర్తు చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున రూ. 10 లక్షల చెక్కును మృతుడి భార్య సత్యమ్మకు కేంద్ర మంత్రి అందజేశారు.

Read Also: TG Municipal Elections : ఫిబ్రవరి 16న చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక

I ​​came on the orders of Prime Minister Modi.

మక్తల్ బిజెపి అభ్యర్థి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి

ఈ సందర్భంగా కిషన్ (Kishan Reddy) మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుండి పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. పార్లమెంటు సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తాను తెలుగులో మాట్లాడడం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే అలా మాట్లాదానని అన్నారు. తాను పార్లమెంటులో ఎరుకలి మహదేవప్ప ఆత్మహత్య సంఘటనను ప్రస్తావించిన తక్షణమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మక్తల్ వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించమని ఆదేశించారని తెలిపారు.

ఈ సంఘటన పై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి చట్టరీత్యా పోలీసులు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంట మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, కొండయ్య, రంగపాండు రెడ్డి తదితరులు ఉన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

BJP candidate Kishan Reddy Latest News in Telugu Maktal Municipality Narendra Modi suicide case Telugu News Victim Family Support

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.