📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kharif: గత యేడాది కంటే తగ్గిన ఖరీఫ్

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది కంటే ప్రస్తుత ఖరీఫ్లో (Kharif) సాగైన విస్తీర్ణంలో తగ్గుదల చోటు చేసుకుంది. వర్షాలు సకాలంలో, సరిపడా కురవకపోవడంతో పాటు, బోరు బావులు, చెరువుల్లో అంతంత మాత్రంగా ఉన్న నీటి నిల్వల ప్రభావం (Effect of water storage) ఖరీఫ్ (Kharif) సాగుపై చూపుతోంది.

44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట సాగు

ఈ వానాకాలం సీజనులో రాష్ట్ర వ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాలు సాగవుతుందని అంచనా వేయగా, అందులో ఇప్పటివరకు 44.10 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలో వెల్లడయింది. గతేడాది వానాకాలంలో ఇదే సమయానికి 46.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, రెండు సీజన్ల పంటలను పోలిస్తే ఈ సారి 2.85 లక్షలు తక్కువగా (2.85 lakhs less) సాగైనట్లు అంచనా వేసింది. ఇక ఈ ఏడాది జూన్లో 138 మి.మీ. వర్షపాత నమోదుకాగా, గతేడాదిలో 170 మి.మీ. వర్షం పడి పంటలు సాగుచేసేలా చేసింది.

రాష్ట్రంలో అంతంత మాత్రంగా వర్షాలు కురిసిన చోట మాత్రమే పత్తి, మొక్కజొన్న, పెసలు, మిర్చి, సోయాబీన్, కంది తదితర ఆరు తడి పంటలు మాత్రమే వేశారు. గతేడాది పత్తి 33.10 ఎకరాలు సాగుచేయగా ఈసారి 31.25 లక్షల ఎకరాలు వేశారు. పెసలు 32 వేల ఎకరాల్లో వేయగా ఈసారి 27,123 ఎకరాలు, వరి 1.57 లక్షలు వేయగా, ఈసారి 2.15 లక్షలు ఎకరాలు సాగుచేశారు. మొక్కజొన్న 2.48 లక్షలు, కందులు 2.72 లక్షలు, సోయాబీన్ 2.65 లక్షలు, చెరుకు 15,100 ఎకరాల్లో రైతులు వేసినట్లు జూన్లో వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది .

ఖరీఫ్ సీజన్ అంటే ఏమిటి?

ఖరీఫ్ సీజన్ అనేది భారతదేశ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన పంటల సాగు కాలం. ఇది సాధారణంగా జూన్ నెలలో ప్రారంభమై, అక్టోబర్ లేదా నవంబర్ వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో మోన్సూన్ (వర్షాకాలం) ప్రారంభమవడం వల్ల ఎక్కువగా వర్షాధారిత పంటల సాగు జరుగుతుంది.

ఖరీఫ్ ప్రధాన పంటలు

వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ, సోయాబీన్, మిరప, నువ్వులు. వర్షాధారంగా సాగుతాయి,వేడి మరియు తేమ ఉన్న వాతావరణం అవసరం.

Read hindi news: hindi.vaartha.com

Read also: BC Reservations: బిసి రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్లో స్పష్టతనివ్వాలి – మంత్రి పొన్నం తో బిసి నేతల భేటీ

AgricultureCrisis Breaking News FarmerIssues Kharif2025 KharifCrop latest news MonsoonImpact Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.