📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్

Kharge: ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే సభను విజయవంతం చేయండి– పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పిలుపు

Author Icon By Ramya
Updated: July 2, 2025 • 3:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: ఈనెల 4న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో (LB Stadium) ఏర్పాటు చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని గ్రామ శాఖ అధ్యక్షుడు మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. ఈనెల 4న ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి లతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియాతో మాట్లాడారు.
గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (All India Congress Committee) మల్లికార్జున ఖర్గే (Kharge) నేరుగా సమావేశం కావడం దేశంలోనే ఇది మొదటిసారి అని డిప్యూటీ సీఎం వివరించారు.

ఖర్గే సభ – తెలంగాణకు మొదటి అవకాశం

తెలంగాణ రాష్ట్రం అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. నాలుగో తారీఖు సాయంత్రం మూడు గంటలకల్లా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల శాఖ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒకరికి మరొకరు సమాచారం చేర వేసుకొని సమన్వయంతో సభకు విచ్చేసి విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసిసి (AICC) అధ్యక్షుడు మాట్లాడే కార్యక్రమానికి మొదటి అవకాశం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినందుకు అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) తో నేరుగా కలిసి మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు.

Read also: Universities Budget 2025: వర్సిటీలు కేటాయించిన బడ్జెట్​ల పై పలు ప్రశ్నలను సంధించిన విద్యాశాఖ

#AICCMeeting #AICCVisit #BhattiVikramarka #CongressLeadership #CongressParty #CongressRally #DuddillaSridharBabu #HyderabadEvent #KhargeInHyderabad #LBStadium #Maheshkumargoud #MallikarjunKharge #MeenakshiNatarajan #PonguletiSrinivasReddy #ponnamprabhakar #RohinReddy #TelanganaCongress #TelanganaPolitics #VillageCongressHeads AICC president bhatti vikramarka Breaking News in Telugu Breaking News Telugu Congress district heads Congress leadership meet Congress mandal heads Congress meeting Hyderabad Congress ministers Telangana Congress MPs MLAs Telangana Congress village heads Duddilla Sridhar Babu epaper telugu google news telugu India News in Telugu Kharge Telangana visit Latest News Telugu Latest Telugu News LB Stadium event Mahesh kumar Goud Mallikarjun Kharge Meenakshi Natarajan News Telugu News Telugu Today ponguleti srinivas reddy ponnam prabhakar Rohin Reddy Telangana Congress Telangana politics Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.