Telugu News: Khammam Crime: రౌడీ షీటర్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

Read Time:  1 min
Khammam Crime
Khammam Crime
FONT SIZE
GET APP

ఖమ్మం జిల్లా,(Khammam Crime) రఘునాథపాలెం మండలం, జగ్యా తండాలో అత్యంత దారుణం జరిగింది. ఓ రౌడీ షీటర్ లైంగిక వేధింపులను తట్టుకోలేని ఒక వివాహిత మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎన్ని కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, కీచకుల వేధింపులు ఆగడం లేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. జగ్యా తండాకు చెందిన బోడ సుశీల అనే వివాహిత ఉదయం మరో మహిళతో కలిసి పొలానికి వెళ్లింది. ఈ సమయంలో, వారి ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ సుశీల వద్దకు వెళ్లి తన లైంగిక(Sexual harrasment) కోరిక తీర్చాలని వేధించాడు.

Read Also: Tejashwi Yadav: జీవికా దీదీల నెల‌వారి జీతం 30 వేలు : తేజ‌స్వి యాద‌వ్

Khammam Crime
Khammam Crime: రౌడీ షీటర్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

నిందితుడి దాడి, పోలీసుల హామీ

సుశీల ఈ వేధింపులను(Khammam Crime) తీవ్రంగా ప్రతిఘటించగా, రౌడీ షీటర్ వినయ్ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రౌడీ షీటర్ వేధింపులు, దాడితో తీవ్ర మనస్తాపం చెందిన సుశీల, ఇంటికి తిరిగి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలంలో సుశీల మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. సుశీల భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని రఘునాథపాలెం పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. నిందితుడైన ధరావత్ వినయ్‌పై కొద్ది రోజుల క్రితమే పోలీసులు రౌడీ షీట్ తెరిచినట్లు, అతడు ఇప్పటికే పలు నేరాలకు పాల్పడినట్లు సమాచారం. సుశీల భర్త ఫిర్యాదు ఆధారంగా, రౌడీ షీటర్ వేధింపులు, దాడి కారణంగానే సుశీల ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వినయ్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.