ఖమ్మం జిల్లాలో(Khammam Crime) చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రవర్తనతో విసుగుచెంది, ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడి మద్యంలో(Alcohol) పురుగుల మందు కలిపి తాగించడం వల్ల ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: Chevella Road Accident: మాటకందని వేదన.. వైరల్ అవుతున్న వీడియోలు
వివరాల ప్రకారం, ఆదూరి రాజేష్ తన కుమారుడు ఆదూరి నాగరాజుతో కలకొడిమ గ్రామంలో నివసిస్తున్నాడు. నాగరాజు (18) చిన్నతనంలో తల్లిని కోల్పోయాడు. ఆ తరువాత తండ్రి, కుమారుడు ఇద్దరూ మద్యానికి అలవాటు పడ్డారు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. మద్యం కోసం కుమారుడు తండ్రిని వేధించడం, దాడులు చేయడం అలవాటుగా మారింది.
మద్యంలో పురుగుల మందు కలిపి తాగించిన తండ్రి అరెస్ట్
దాంతో విసుగెత్తిపోయిన రాజేష్ గత నెల 20వ తేదీ (దీపావళి రోజున) తన కుమారుడిని తొలగించాలనే ఉద్దేశ్యంతో కుతంత్రం పన్నాడు. బ్రాందీ సీసాలో పురుగుల మందు కలిపి నాగరాజుకి ఇచ్చాడు. మద్యం అని భావించిన నాగరాజు దానిని తాగాడు. కొద్ది సేపటికే అస్వస్థతకు గురై అతన్ని ఖమ్మం(Khammam Crime) ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే వైద్యం పొందుతున్న నాగరాజు అక్టోబర్ 31న సాయంత్రం మరణించాడు. అనంతరం మృతుడి పెద్దమ్మ తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రే తన కుమారుడిని హతమార్చాడని ఆమె ఆరోపణ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లాడ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ, “మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: