📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Khammam: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్

Author Icon By Saritha
Updated: February 19, 2026 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Khammam: పత్తి రైతులకు అలర్ట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లు బంద్ కానున్నాయి. సీసీఐ ఆధ్వర్యంలో ప్రస్తుతం పత్తి (Cotton) కొనుగోళ్లు చేస్తుండగా.. రేపటివి పూర్తికానున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో నాలుగు నెలలోనే రూ.583.23కోట్ల పత్తిని సేకరించింది. దాదాపు 82 శాతం సొమ్మును రైతుల ఖాతాల్లోకి జమ చేసింది. ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం, మద్దులపల్లి, మధిర, వైరా, బూర్గంపాడు, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో 14 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Read Also: Telangana Funds: తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటుకు నిధులు మంజూరు

Khammam: Cotton procurement banned from tomorrow

కొనుగోలు గణాంకాలు చెల్లింపుల వివరాలు

గతేడాది అక్టోబర్‌లో కొనుగోళ్లు నుంచి ఈనెల 17 వరకు 7,45,391 క్వింటాళ్ల పత్తి సేకరించారు. వాటి విలువ రూ.583.23 కోట్లు. ముందు వారానికోసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు చేయగా ప్రస్తుతం మూడు రోజుల్లోనే డబ్బులు పడుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు వెల్లడిస్తిన్నారు. దాదాపు 6,01,391 క్వింటాళ్లకు రూ.481.11 కోట్ల చెల్లింపులు జరిగాయని చెప్పారు.

ఉమ్మడి జిల్లాలో 4.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేయగా గతేడాదితో పోలిస్తే దిగుబడి కాస్త తగ్గింది. దానికి తోడు మొంథా తుపాను ధాటికి పత్తి తడవటంతోపాటుగా తెగుళ్ల కారణంగా చాలా ఎకరాల్లో మొక్కలు చనిపోయాయి. దీంతో చాలా రైతులు పత్తిపంటను తొలగించి మొక్కజొన్న సాగుచేశారు. ప్రారంభంలో సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యం కారణంగా రైతులు దళారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వ్యాపారులు తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేయటంతో రైతులకు గిట్టుబాటు కాలేదు. ఆ తర్వాత సీసీఐ ద్వారా క్వింటాకు రూ.8,110 చొప్పున మద్దతు ధర లభించింది.

స్లాట్ బుకింగ్

ఇక ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని అమలు చేసింది. చాలా మంది రైతులకు స్మార్ట్‌ఫోన్లు లేక, యాప్‌పై అవగాహన లేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించటంతో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చింది. కాగా, శుక్రవారంతో సీసీఐ కొనుగోళ్లు ముగియనున్న నేపథ్యంలో మిగిలిన రైతులు స్లాట్‌ బుక్‌ చేసుకొని నిబంధనల ప్రకారం పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

CCI Cotton Procurement Cotton Price Update Khammam Cotton Purchases Latest News in Telugu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.