పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నేపథ్యంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హిమాయత్‌నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన, తన రాజకీయ బలం పూర్తిగా కార్యకర్తల అండేనని స్పష్టం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో కార్యకర్తల కృషే కీలకమని పేర్కొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగినా ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Read also: Nizamabad: ATM దుండగులు కలకలం: రాత్రికి రాత్రి రూ. 30 లక్షలు మాయం
I won six times with the support of the party workers
రేవంత్ రెడ్డిపై చేసే విమర్శలు
వ్యక్తిగత విమర్శలను పక్కన పెట్టి అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసే విమర్శలు మర్యాదగా ఉండాలని, పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని అన్నారు. అలాగే, అవినీతి ఆరోపణలపై మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను కోరారు. ఆరోపణలకే పరిమితం కాకుండా, విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: