📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Seetadayakar Reddy : సీతా దయాకర్‌రెడ్డికి కీలక పదవి

Author Icon By sumalatha chinthakayala
Updated: April 4, 2025 • 8:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Seetadayakar Reddy : బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ గా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ఎంపిక అయ్యారు అని 20 రోజుల క్రితం దిశ లో వచ్చిన కథనం నిజం అయ్యింది. ఈ మేరకు గురువారం సీతా దయాకర్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులు అందడంతో ఆమె శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సీతా దయాకర్ రెడ్డి 2001 లో దేవరకద్ర జెడ్పిటిసి సభ్యురాలుగా విజయం సాధించి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేసి.. అప్పట్లో అధికార పక్షమే కాదు ప్రతిపక్ష నేతల అభినందనలు అందుకునేలా విధులు నిర్వహించారు. 2009లో దేవరకద్ర ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం

అదే సమయంలో ఆమె భర్త దయాకర్ రెడ్డి సైతం మక్తల్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో. ఒకే సమయంలో భార్యాభర్తలు అసెంబ్లీలో ప్రవేశించిన ఘనతను సాధించారు. 2014లో దేవరకద్ర ఎమ్మెల్యేగా రెండవసారి పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన సీతా దయాకర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల కు కొన్ని వారాల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, విద్యార్హతలు ఉన్న కారణంగా సీతా దయాకర్ రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా ఎంపికయ్యారు. సీతా దయాకర్ రెడ్డికి పదవి దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న వారి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Sita Dayakar Reddy Telangana State Commission for Protection of Child Rights Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.