📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు

Registration : తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు

Author Icon By Sudheer
Updated: June 1, 2025 • 7:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్ (Property Registration) వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఆధార్ ఆధారిత ఈ-సంతకం విధానాన్ని ప్రవేశపెట్టి స్లాట్ బుకింగ్‌ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ విధానాన్ని త్వరలో 144 కార్యాలయాలకు విస్తరించనున్నారు.

47 కార్యాలయాల్లో ఇప్పటికే సక్సెస్

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకారం, ఇప్పటికే 47 కార్యాలయాల్లో విజయవంతంగా అమలైన ఈ విధానం జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 కార్యాలయాల్లోనూ ప్రారంభించనున్నారు. ప్రజల సౌకర్యార్థం AI చాట్‌బాట్ ‘మేధా’ కూడా అందుబాటులోకి తెచ్చారు. స్లాట్ బుకింగ్ విధానం ప్రజలకు సమయాన్ని ఆదా చేస్తూ అవినీతి రహిత సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది. 94 శాతం మంది ప్రజలు ఈ విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.

త్వరలోనే డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు డెవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్‌లు ఎరుపు రంగులో కనిపించి డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించగలుగుతారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మరింత సమర్థవంతంగా సాగేందుకు పనిభారం పెరిగిన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు 48 స్లాట్లు అందుబాటులో ఉండగా, అత్యవసర సందర్భాల్లో 5:30 వరకు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈ సమగ్ర మార్పులు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలకు కొత్త దిశను చూపనున్నాయి.

Read Also : Kia Car : రికార్డు స్థాయిలో కియా కార్ల అమ్మకాలు

Google News in Telugu property registration registration Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.