📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Keshav Prasad Maurya: యూపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం!

Author Icon By Saritha
Updated: March 7, 2026 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Keshav Prasad Maurya: A missed opportunity for UP Deputy CM!

Keshav Prasad Maurya: ఉత్తరప్రదేశ్ (UP) డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తృటిలో ప్రమాదం తప్పింది. లక్నో నుంచి కౌశాంబి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్యాబిన్‌లో సాంకేతిక లోపం వల్ల ఒక్కసారిగా పొగలు వచ్చాయి. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. గాలిలో ఉండగానే హెలికాప్టర్ క్యాబిన్ లో ఒక్కసారిగా పొగలు రావడంతో పైలట్ అప్రమత్తమై, హెలికాప్టర్ను వెనక్కి మళ్లించారు. ఈ ఘటనలో డిప్యూటీ సీఎం సహా అందులోని వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Read Also: Bangalore Crime: సాంబార్ విషయంలో గొడవ.. ఇల్లాలు ఆత్మహత్య

క్షేమంగా కేశవ్ ప్రసాద్ మౌర్య

సమాచారం ప్రకారం కేశవ్ ప్రసాద్ మౌర్య శనివారం ఉదయం లక్నో నుంచి కౌశాంబి జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరారు. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే హెలికాప్టర్ లోపల పొగలు రావడం పైలట్ దృష్టికి వచ్చింది. ఈ ఆకస్మిక పరిణామంతో అప్రమత్తమైన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా లక్నో విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే హెలికాప్టర్ను వెనక్కి మళ్లించి, విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అధికారులు రన్వే వద్ద అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో మౌర్యతో పాటు ఉన్న సిబ్బంది, పైలట్లకు ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Helicopter Emergency Landing Keshav Prasad Maurya Lucknow Airport Technical Snag UP Deputy CM

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.