KCR vs Kavitha:కేసీఆర్ మన మనిషి కాదు.. మర మనిషి: కవిత సంచలన వ్యాఖ్యలు

Follow Us: Google News Daily Hunt
Kavitha Criticizes KCR
Kavitha Criticizes KCR
FONT SIZE
GET APP

KCR vs Kavitha: తెలంగాణ రాజకీయ పోరాటంలో భాగంగా తన కొత్త పార్టీని ప్రకటించిన కల్వకుంట్ల కవిత, ప్రసంగం ఆరంభంలోనే నిప్పులు చెరిగారు. భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ తీరుపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

Read Also :Kavita : కవిత కొత్త పార్టీ తో ఏం చేయబోతున్నారు?

KCR vs Kavitha

“పాత కేసీఆర్ ఎక్కడ?” – కవిత ప్రశ్న

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ మౌనాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. గతంలో ప్రజల కోసం పోరాడిన కేసీఆర్ ఇప్పుడు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

KCR vs Kavitha: కవిత ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • మర మనిషిగా కేసీఆర్: “ఇప్పటి కేసీఆర్ మన మనిషి కాదు.. ఆయనో మారిన మనిషి, ఒక మర మనిషి (రోబో)” అంటూ విమర్శించారు.
  • ప్రజల కష్టాలు: అర్ధరాత్రి వేళ ఇళ్లు కూలుస్తుంటే ఆదుకోవాల్సిన ‘అమ్మ’ లాంటి పాత కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు.
  • రైతుల గోస: పొలాలు మునిగిపోయి రైతులు కన్నీరు పెడుతున్నా కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని ఆమె ఎండగట్టారు.
  • బందీ అయ్యారు: “ఆ సారు బయటకు రారు.. ఆయన ఇప్పుడు గుంట నక్కలు, తోడేళ్ల చేతిలో బందీ అయ్యారు” అంటూ కేసీఆర్ చుట్టూ ఉన్న కోటరీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కొత్త రాజకీయ బాట

తెలంగాణలో ‘కర్కోటకుడి పాలన’ నడుస్తోందని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత తనపై ఉందని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తెలంగాణ ఆకాంక్షలను గాలికొదిలేసిందని, అందుకే తాను ‘తెలంగాణ రాష్ట్ర సేన’ తో ప్రజల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఒకప్పుడు కేసీఆర్ వెనుక నడిచిన కవిత, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పడం తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా పరిగణించబడుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు