బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ (KCR) సాధించిన తెలంగాణను రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నా, ప్రస్తుతం రాష్ట్రాన్ని మళ్లీ ఆంధ్ర నాయకుల చేతుల్లోకి మోసే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు. డిసెంబర్ 9 ప్రకటన తెలంగాణ ఉద్యమానికి చారిత్రక మలుపు తిప్పిన ఘటనగా గుర్తిస్తూ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కష్టపడి సాధించిన తెలంగాణ నేడు దోపిడీ దొంగల పాలనకు లోనవుతోందని, వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మడమే ఈ ప్రభుత్వం ప్రధాన పనిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Free Bus: ఫ్రీ బస్సు పథకం ఈ రోజుకి రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంది..

Telangana achieved by KCR has fallen to thieves
రాబందుల పాలన కొనసాగించడం
వేముల ప్రశాంత్ రండి, నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణంలో జరిగిన ‘విజయ్ దివస్’ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు నివాళులు అర్పించారు. కేసీఆర్ నాయకత్వంలో అనేక పోరాటాల తర్వాత తెలంగాణ సాకారమైందని, ఆయన పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. “కేసీఆర్ కడుపులో పెట్టుకుని రక్షించిన తెలంగాణను దోపిడీ దొంగలకు అప్పగించడం, రాష్ట్రంలో రాక్షసుల, రాబందుల పాలన కొనసాగించడం, సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడం,ఇది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి” అని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: