భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) లో ఈ మధ్యకాలంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆమె రాసిన ఓ లేఖ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల మధ్య, పార్టీ అధినేత కేసీఆర్ మౌనం పాటించడమే కాకుండా, కేటీఆర్ దూరంగా వ్యవహరించడం వెనుక ఉన్న అసలైన కారణాలు ఏమిటనే అనుమానాలు ఊపందుకున్నాయి.
కవిత లేఖ – బాధనో? వ్యూహమో?
కవిత రాసిన లేఖ ఆమె పార్టీ కార్యకలాపాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, పార్టీ లోతుల్లో ఉన్న విభేదాలపై బయటకు వచ్చిన ఒక సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కేటీఆర్ తీరు – మౌనం వెనుక వ్యూహం?
కేటీఆర్, కెసిఆర్ తో భేటీ అయిన తర్వాత పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు అంతర్గతంగా కవిత వ్యవహారం పైన ఎవరు స్పందించవద్దని కేటీఆర్ సమాచారం ఇచ్చారు. ఎర్రవల్లి లోని నివాసంలో కెసిఆర్ తో కేటీఆర్ భేటీలో, కవిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల పైన సీరియస్ గానే చర్చించినట్లు తెలుస్తుంది.
పార్టీ లో పసిగట్టి బయటపడిన విభేదాలు
కవిత చేసిన వ్యాఖ్యల తరువాత, బీఆర్‌ఎస్ లో ఉన్న పాత నేతల మధ్య, కొత్త తరం నాయకత్వం మధ్య గల విభేదాలు తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఎన్నికల్లో ఓటమి తరువాత, పార్టీ పునర్నిర్మాణం పేరుతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, యువతపై ఎక్కువగా ఆధారపడడం వంటి మార్పులు కొందరికి ఆమోదయోగ్యం కాలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన అంశాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయని, జరిగిన పరిణామాలపై ఎవరు బహిరంగంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదని, టీవీ చర్చలలో మాట్లాడకూడదని ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కెసిఆర్ తో సమావేశమైన తర్వాత కేటీఆర్ ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నాయకులకు అంతర్గతం
కవితకు బిగ్ షాక్ – ఒంటరిని చేస్తున్నారా?
ఇక ఈ తాజా నిర్ణయంతో కవితను కెసిఆర్ మాట్లాడడానికి పిలిచే అవకాశం లేదని, ఆమె వేదన అరణ్య రోదన గానే మిగిలిపోయే అవకాశం ఉందని, కవిత ఒంటరి పోరాటం చేయాల్సిందే నిన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా కవిత విషయంలో ఆమెతో నేరుగా భేటీ అయి మాట్లాడకుండా పార్టీ తీసుకున్న నిర్ణయం కవితకు బిగ్ షాక్ అనే చెప్పాలి.
కేసీఆర్ వ్యూహం – రష్యన్ మోడల్?
కేసీఆర్ కేటీఆర్ భేటీలో కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.అయితే ఈ తరహా ప్రచారాలకు, విమర్శలకు, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించకూడదని, ఎక్కువగా ఈ విషయాలపై చర్చ చేస్తే, పార్టీ నాయకులు, కార్యకర్తలలో అనవసరమైన గందరగోళాన్ని సృష్టించిన వారమవుతామని కెసిఆర్ కేటీఆర్ కు సూచించినట్లు సమాచారం.
Read also: Revanth Reddy: తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు కసరత్తు