KCR: హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ (TG) ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంప్రదాయంలో రంగుల పండుగకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఇది మనుషుల మధ్య ప్రేమాభిమానాలను పెంపొందించే అద్భుతమైన వేదిక అని ఆయన కొనియాడారు. ఆకులు రాలే శిశిరం ముగిసి, ప్రకృతి కొత్త చిగురులు తొడిగే వసంతానికి బాటలు వేస్తూ వచ్చే ఈ పండుగ, సామాజిక జీవితంలో నూతనత్వానికి సంకేతమని కేసీఆర్ అభివర్ణించారు.
Read Also: Nara Lokesh: మంగళగిరి శ్రీవారి కల్యాణంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ దంపతులు
ప్రస్తుత పరిస్థితుల్లో కొంత నిరాశలో ఉన్న తెలంగాణ ప్రజల్లో ఈ హోలీ పండుగ సరికొత్త ఆశలను, విశ్వాసాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా సహోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని, ఈ రంగుల వేడుక అందరి నడుమ ఆప్యాయతలను మరింతగా విరజిమ్మాలని కేసీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పుల వలెనే ప్రజల జీవితాల్లో కూడా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: