📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

Author Icon By Sharanya
Updated: May 18, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌ నగరంలో చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌ ప్రాంతంలో ఉదయం సంభవించిన ఘోర అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ హృదయవిదారక ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్పందన తెలిపారు.

కేసీఆర్ స్పందన:

ఈ ఘటనపై స్పందించిన కేసీఆర్, గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం ఎంతో బాధాకరం. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించి, వారి ప్రాణాలు కాపాడాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కేటీఆర్ స్పందన:

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ ఈ అగ్నిప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్‌ అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే తమ పార్టీ బృందం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతోందని కేటీఆర్ తెలిపారు.

హరీశ్ రావు:

ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ, “ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి,” అని డిమాండ్ చేశారు. బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణ స్పందన చూపించాలని కోరారు. ఆయన కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read also: Fire Accident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

#FireAccident #GulzarHouseFire #HarishRao #HyderabadFireAccident #KCR #KCRResponse #ktr #telangana Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.