📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Harish Rao : కేసీఆర్ వాటర్ మ్యాన్ .. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ – హ‌రీశ్‌రావు

Author Icon By Sudheer
Updated: July 2, 2025 • 7:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao), సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ను “వాటర్ మ్యాన్” అని అభివర్ణిస్తూ, రేవంత్ రెడ్డిని “వాటా మ్యాన్” అని విమర్శించారు. “అదృష్టం బాగా ఉండి సీఎం అయ్యావు, ఐదేళ్లు పదవిలో ఉండి మంచిగా పాలించు. తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయంలో అన్యాయం చేయకు. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహిగా చరిత్రలో ఎక్కావు, కానీ రాష్ట్ర ద్రోహిగా మిగలకూ” అంటూ రేవంత్‌ను హరీశ్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడం మానేయాలని సూచించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు.. సీతారామ అనుమతులపై క్లారిటీ

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar) కూడా సమగ్ర అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. “ఉత్తమ్ కూడా రేవంత్ లాగే అబద్ధాల వాడి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు” అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతుల విషయమై, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 2023లో 25 అనుమతులు వచ్చాయని స్పష్టం చేశారు. పర్యావరణ, హైడ్రాలజీ సహా అన్ని కీలక అనుమతులు అప్పుడే తీసుకున్నామని చెప్పారు. అసెంబ్లీలో వీరంగా చర్చకు సిద్ధమని ప్రకటించారు.

వెనుకబాటు వద్దు.. అసెంబ్లీలో చర్చకు సవాల్

“రేపే అసెంబ్లీ పెడితే, కృష్ణా-గోదావరి నదులపై నెల రోజుల చర్చకు సిద్ధం. ఒక్క షరతే మైక్ కట్ చేయొద్దు, పారిపోకండి” అంటూ హరీశ్ రావు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను ఉదహరిస్తూ, బనకచర్ల విషయంలో చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారన్న ఆరోపణపై స్పందిస్తూ, “ఆ కోవర్టు ఎవరో అనిరుధ్ చెప్తే బాగుంటుంది” అన్నారు. దీంతో తెలంగాణలో నీటి హక్కుల విషయంలో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Read Also : Pasamylaram fire accident: సిగాచీ పరిశ్రమ వద్ద బాధితుల కుటుంబసభ్యుల ఆందోళన

Google News in Telugu harish rao KCR kcr water man revanth vaata man

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.