📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: కాటన్ మాదిరిగా కేసీఆర్ చరిత్ర ఘనతలో నిలుస్తారు: హరీశ్ రావు

Author Icon By Sharanya
Updated: August 5, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్‌ఎస్ సీనియర్ నేత, హరీష్ రావు గోదావరి ప్రాజెక్టుల నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (KCR) ను బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ (Sir Arthur Cotton) తో పోల్చారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ ప్రస్తావన చేస్తూ, తెలంగాణలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే చరిత్రాత్మకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.

KCR

కాటన్ గోదావరి జిల్లాలకు నీటి ప్రాణం – కేసీఆర్ తెలంగాణకు

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ – బ్రిటీష్ పాలనలో ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీటి భద్రత కలిగించారని గుర్తు చేశారు. రైతుల సంక్షేమం కోసం కాటన్ చేసిన కృషికి బ్రిటీష్ ప్రభుత్వం కూడా విమర్శలతో స్పందించిందని.. హెమింగ్టన్ కమిషన్ ద్వారా కాటన్‌ను 900 ప్రశ్నలు అడిగి, వేధించిందని వివరించారు.

కాళేశ్వరం – తెలంగాణకు జీవనాధారం

అలాగే, కేసీఆర్ (KCR) కూడా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం ద్వారా తెలంగాణ భవిష్యత్తుకు బలమైన మౌలిక వనరులు అందించారని హరీష్ పేర్కొన్నారు. ఇది కూడా సిరిసిల్ల నుంచి మహబూబ్నగర్ వరకు సాగు నీటిని, తాగునీటిని అందించే దిశగా కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని చెప్పారు.

‘కాళేశ్వరం గురించి రేవంత్‌కు కూడా తెలుసు’’

కాళేళ్వరం తెలంగాణకు గుండెకాయ వంటిదని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతపై అవగాహన ఉందని హరీష్ అన్నారు. మల్లన్నసాగర్ నుంచి మూసీ నదిలోకి నీళ్లు తరలించే ప్రాజెక్టుకు రూ.6 వేల కోట్ల టెండర్లు ఫైనల్ కావడాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ కాళేశ్వరంలో భాగమేనని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం కాళేశ్వరం, మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/zomato-delivery-boys-hit-the-road-in-uppal/telangana/526339/

Breaking News Cotton harishrao IrrigationProjects KaleshwaramProject KCR latest news TelanganaPolitics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.