📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR: ఉప ఎన్నికల సన్నద్ధం అవ్వండి

Author Icon By Anusha
Updated: August 2, 2025 • 10:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. ఈ ఉప ఎన్నికల (By-elections) కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రతి నాయకుడు కృషి చేయాలని, ఆ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడానికి దృష్టి పెట్టాలని కేసీఆర్ చెప్పారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోందని కేసీఆర్ (KCR) విమర్శించారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి లోక్ సభలో కనీసం డజన్ మంది ఎంపీలు ఉన్నా బనకచర్ల అంశంపై గట్టిగా పోరాడి ఉండేవారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తగిన విధంగా

బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని కేసీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడం తో పాటు బహిరంగ సభ నిర్వహించి ప్రజల మద్దతును సంపాదించుకోవాలని సూచించారు. తెలంగాణ హక్కుల విషయంలో ఎవరూ వెనకడుగు వేయకుండా, తగిన విధంగా పోరాడాలని పార్టీ కేడర్‌కు పిలుపునిచ్చారు.బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. 8న కరీంనగర్‌లో జరిగే భారీ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేస్తుందని కేసీఆర్ తెలిపారు.

కేసీఆర్ పూర్తి పేరు ఏమిటి?

కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

కేసీఆర్ ఏ పార్టీకి అధినేత?

కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి – BRS) పార్టీ వ్యవస్థాపకుడు అధినేత.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sucide: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Breaking News KCR statements on Banakacharla project latest news local body elections telangana Party defection by MLAs Telangana by-elections 2025 Telangana politics updates Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.