తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ (KCR) అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. (Fully recovered from illness) ఆయన గురువారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేరగా, శనివారం ఉదయం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యం మెరుగుపడి, డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత నేరుగా ఆయన తన నివాసమైన నందినగర్‌కు చేరుకున్నారు.
హుటాహుటిన ఆసుపత్రిలో చేరిక
ఈ నెల 3వ తేదీన కేసీఆర్ (KCR) కు తీవ్రమైన జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు (Blood sugar levels with fever) గణనీయంగా పెరగడం, సోడియం స్థాయిలు పడిపోవడంతో కేసీఆర్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన యశోద ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు.
ఆరోగ్య స్థితిపై వైద్యుల ప్రకటన
శనివారం ఉదయం యశోద ఆసుపత్రి వైద్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన రక్తంలో చక్కెర, సోడియం స్థాయిలు సాధారణ స్థితికి చేరాయని స్పష్టం చేశారు. జ్వరం కూడా తగ్గడంతో నిన్నటి నుంచే ఆయన ఉత్సాహంగా ఉన్నారని, పార్టీ నేతలతో కూడా మాట్లాడారని తెలిసింది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడటంతో ఆయన్ను డిశ్చార్జ్ చేసేందుకు వైద్యులు అనుమతించారు.
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: Kodanda Reddy: రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు పెరగాలి – రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
Andela Sriramulu Yadav: బిజెపి నేత ఇంటి వద్ద రోహింగ్యాల అనుమానాస్పద సంచారం