📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

KCR : కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసాడు – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: December 24, 2025 • 9:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య పాత కక్షలు, ప్రస్తుత రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన రాజకీయ వేధింపులను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనపై ఏకంగా 181 కేసులు పెట్టారని, అక్రమంగా జైలులో బంధించి తన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఒక సాధారణ కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే క్రమంలో తాను ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ, కేసీఆర్ పాలనలో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

CP Sajjanar: న్యూఇయర్‌ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు

అయితే, ప్రస్తుతం తాను అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్ పై పగ సాధింపు చర్యలకు దిగడం లేదని రేవంత్ స్పష్టం చేశారు. “తాను పగ తీర్చుకోవాలనుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఆయన చేసిన పాపాలకు ఆయనే అనుభవిస్తారని వదిలేశాను” అని వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేసీఆర్ కిందపడి నడుము విరగ్గొట్టుకోవడం దైవ నిర్ణయమని, ఇప్పుడు ఆయన తన సొంత ఫామ్ హౌస్‌నే ఒక బందీఖానాగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. శారీరక ఇబ్బందులు, రాజకీయ ఒంటరితనం వల్ల ఆయన బయటకు రాలేకపోతున్నారని, అది ఆయనకు ప్రకృతి ఇచ్చిన శిక్ష అని రేవంత్ అభివర్ణించారు.

కేసీఆర్‌ను జైలుకు పంపాలన్న డిమాండ్లపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కేసీఆర్‌ను జైలులో పెడితే అనవసరంగా ప్రభుత్వానికే ఖర్చు పెరుగుతుందని, ఆయనకు భోజనం, వసతి కల్పించడం కంటే ఫామ్ హౌస్‌లో ఉండటమే మంచిదని వ్యాఖ్యానించారు. “ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఉన్నది నా పోలీసులే.. ఆయనకు అంతకంటే పెద్ద జైలు ఏముంటుంది?” అని ప్రశ్నించారు. చుట్టూ తన ప్రభుత్వం పహారా కాస్తుండగా, బయటకు రాలేని స్థితిలో ఉండటమే కేసీఆర్‌కు అసలైన శిక్ష అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

cm revanth Google News in Telugu KCR revanth jail

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.