KCR birthday: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పుట్టినరోజు సందర్భంగా రాజకీయ వర్గాల నుంచి శుభాకాంక్షల వెల్లువ వచ్చాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖ నాయకులు, పార్టీ నేతలు, అభిమానులు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
Read Also: Chandrababu Naidu: ఆ ఐదు ఊళ్లివ్వండి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా ప్రజాసేవే ముఖ్యమని పేర్కొంటూ, కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా భావోద్వేగంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నా ఫరెవర్ హీరోకు 72వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి రోజూ నాకు ప్రేరణనిచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను గుర్తుచేస్తూ ప్రశంసలు కురిపించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అనాథాశ్రమాలకు విరాళాలు, రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: