📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

KCR : హాస్పటల్ లోనే ప్రజా సమస్యలపై కేసీఆర్ చర్చ

Author Icon By Sudheer
Updated: July 4, 2025 • 8:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోగ్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజల సమస్యలపై తన దృష్టిని మళ్లించలేదు. శుక్రవారం ఆసుపత్రిలోనే ఆయనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఎక్కడ ఉన్నా పార్టీని, ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనని ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.

రైతుల సమస్యలపై కేసీఆర్ ఆరా

ఈ సమావేశానికి కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. వారితో చర్చల సందర్భంగా కేసీఆర్ ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. యూరియా కొరత, సాగునీటి ప్రాజెక్టులపై వదిలిన పట్టా ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. బనకచర్ల ప్రాజెక్టు విషయమై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ఎదుర్కొనే మార్గాలు కూడా చర్చలో భాగమయ్యాయి.

క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న బీఆర్‌ఎస్ అధినేత

పార్టీ నాయకులు వివరించిన క్షేత్రస్థాయి పరిస్థితులను కేసీఆర్ శ్రద్ధగా విన్నారు. ప్రతి అంశంపై వివరాలు తెలుసుకుని, వారివద్ద నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా స్వీకరించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై రాజకీయ ప్రతిస్పందన అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయంగా కొంత కాలంగా బహిరంగంగా కనిపించని కేసీఆర్, ఆసుపత్రిలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు మరింత బలాన్నిస్తోన్న సంకేతాలుగా ఈ పరిణామాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

Read Also : Lokesh : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం – నారా లోకేష్

KCR KCR Yashoda hospital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.