Kavitha: రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి

Read Time:  1 min
Kavitha: రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలి
FONT SIZE
GET APP

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించి రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించారు. రాబోయే రెండు నెలల్లోనే ఈ పార్టీ విధివిధానాలు వెల్లడిస్తానని ఆమె తెలిపారు. రాజకీయం చేయాలంటే ధైర్యం ఉండాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వం ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయాల్లో ఎన్నో ఆసక్తికరమైన మార్పులు (Surprises) ఉంటాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Telangana: అసెంబ్లీలో స్పీకర్‌ను కలిసిన మల్లు భట్టివిక్రమార్క

మద్యం కేసు, జైలు జీవితంపై ఆవేదన

ఢిల్లీ మద్యం పాలసీ కేసు గురించి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై కవిత ఘాటుగా స్పందించారు. ఐదు నెలల పాటు తనను జైల్లో పెట్టి మానసిక క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో తనకు పెద్దగా పరిచయాలు లేవని, సంజయ్ సింగ్ ఎంపీ కావడం వల్ల మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. తనకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు, తాను అరెస్టయినప్పుడు ఎక్కడకు వెళ్లారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

Kavitha: You need courage to do politics
Kavitha: You need courage to do politics

కుమ్మెర జాతర ఘటన

సమస్యలు ఉన్నప్పుడు తాను షో చేయడానికి ఎప్పుడూ వెళ్లనని కవిత తెలిపారు. కుమ్మెర జాతర ఘటనపై తాను ఆ రోజే ఎస్పీతో మాట్లాడానని వెల్లడించారు. నిందితులకు తగిన శిక్ష పడాలని బాధిత కుటుంబం, తాము కోరుకుంటున్నామని అన్నారు.సమాజం పట్ల మన కంటే లక్ష రెట్ల అవగాహన మావోయిస్టు అగ్రనేతలకు ఉందని కవిత పేర్కొన్నారు. నేను సమాజంలో ఉండి పోరాడితే, వారు అడవుల్లో ఉంటూ సమాజం కోసం పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. మావోయిస్టులు లొంగిపోయి సిద్ధాంతాన్ని బ్రతికించారని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద గాంధీ విగ్రహం పెట్టడాన్ని తప్పుపట్టదలుచుకోలేదని కవిత తెలిపారు. కానీ ఈ ప్రాజెక్టు కోసం అన్ని ఇళ్లు కూలగొట్టడం ఎందుకని ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.