📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kavitha: కెసిఆర్ ను సిట్ విచారణ కోసం పిలిస్తే తప్పేంటి?

Author Icon By Saritha
Updated: February 3, 2026 • 11:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రెండేళ్లవుతున్నా సిట్ విచారణ ముగింపునకు రావడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విచారణ త్వరగా పూర్తిచేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని ఆమె కోరారు. సోమవారం విలేకరుల సమావేశంలో కవిత పాల్గొని మాట్లాడారు. సిట్ విచారణలో ఏం జరిగిందో మాజీ సీఎం కేసీఆర్ (KCR) చెబుతారని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిట్ విచారణను తప్పుపడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం సరికాదని, చట్టాలను అందరూ గౌరవించాలని కవిత అన్నారు. చట్టానికి సహకరించాలని పేర్కొన్నారు. గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని, తన భర్త ఫోన్లు ట్యాప్ చేశారనే అనుమానాలున్నాయని చెప్పారు.

Read Also: TG: ఇది ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి

తెలంగాణను విస్మరించిన తెలుగింటి ఆడబిడ్డ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల: కవిత

సిట్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్లి సహకరిస్తానని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కవిత (Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఐఐఎం, నవోదయాలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా ఇవ్వట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మెట్రో రైల్ ఫేజ్2 గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదన్న ఆమె తెలుగింటి ఆడబిడ్డ నిర్మల తెలంగాణ ప్రజలను విస్మరించారని మండిపడ్డారు.

ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలు 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కొత్త ఎయిర్పోర్టులు, ఆర్ఆర్ఆర్ను పెండింగ్లోనే పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్రప్రభుత్వం 47 అంశాల గురించి అడిగితే ఏమీ ఇవ్వలేదని, ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి రాష్ట్రానికి ఏమీ తేలేకపోవడం బాధాకరమన్నారు. దేశంలో విద్య, వైద్యానికి 1, 2 శాతమే నిధులు కేటాయించటం దారుణమని కవిత ఆక్షేపించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

kavitha KCR Latest News in Telugu Phone Tapping Case sit investigation Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.