📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kavitha: కొత్తపార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం

Author Icon By Saritha
Updated: February 19, 2026 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) నుంచి ఆమెను సస్పెండ్ చేయగా ఆ తర్వాత ఎమ్మెల్సే పదవికి కూడా కవిత రాజీనామా చేశారు. ప్రస్తుతం జాగృతి తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. మే తొలి వారంలో తాను పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

Read Also: Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో కారు బీభత్సం

వ్యవస్థల ప్రాతిపదికన పార్టీ నిర్మాణం

తాను పెట్టబోయే పార్టీ వ్యక్తుల మీద నడవద్దని వ్యవస్థల మీద నడవాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని తాను పోటీ చేసేందుకు ఫస్ట్ చాయిస్‌గా సిద్దిపేటను తీసుకుంటానన్నారు. సెకండ్ ఛాయిస్‌గా బోధన్ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తానని వెల్లడించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దారిలోనే వెళ్తుంది. కొత్త తరహా రాజకీయం కాంగ్రెస్ చేయడం లేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదనే కోపం కార్మికుల్లో ఉంది. బిల్లుల చెల్లింపు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నయం అనేలా ప్రస్తుత పాలన ఉంది.

ఆడవాళ్లే కదా అని అవమానించవద్దు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడ ప్రజలకు నచ్చలేదు. అదే షర్మిల ఈరోజు ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా…? నా లైన్‌లో నేను వెళ్తున్నా.. నా ప్రయత్నం నాది. తెలంగాణ వాదమే మా పార్టీ మొదటి లైన్. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లు కేంద్ర మంత్రులు అయ్యారు. కొత్త తరానికి నేను పెట్టబోయే పార్టీలో అవకాశం ఉంటుంది అని కవిత వ్యాఖ్యనించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Kalvakuntla Kavitha Latest News in Telugu new political party Siddipet Constituency telangana jagruthi Telangana politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.