తెలంగాణ జాగృతి నూతన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్(KCR)కు కాళేశ్వరం ప్రాజెక్టు నిమిత్తంగా నోటీసులు (Kaleshwaram Commission Notices ) ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా నిరసించారు. “తెలంగాణకు నీటిని అందించేందుకు కృషి చేసిన నేతకు నోటీసులు ఇవ్వడం అంటే, ప్రతీ తెలంగాణ బిడ్డకు నోటీసులు ఇచ్చినట్టే” అని ఆమె మండిపడ్డారు. జూన్ 4న ఇందిరాపార్కులో మహాధర్నా నిర్వహిస్తామంటూ కవిత ప్రకటించారు.
తెలంగాణకు అన్యాయం, సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి, పక్క రాష్ట్రాలకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కవిత (Kavitha) విమర్శించారు. “తెలంగాణ నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం మౌనం వీరంగా ఉంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టు వంటి విషయాల్లో చంద్రబాబుకు జవాబు చెప్పే ధైర్యం లేదు. కేసీఆర్ ప్రతిపాదించిన నదుల అనుసంధానాన్ని కేంద్రం తిరస్కరించి, ఇప్పుడాయనపైనే నోటీసులు వేస్తున్నారు” అని పేర్కొన్నారు. అమరుల పేరుతో రాజీవ్ యువ వికాసం పేరును మార్చాలంటూ డిమాండ్ చేశారు.
బీసీ బిల్లు, మైనారిటీ హక్కులపై పోరాటానికి సిద్ధం
తెలంగాణ జాగృతి సంస్థ బీసీ బిల్లుపై గత ఏడాదిన్నరగా పోరాడుతోందని, రైల్‌రోకో వంటి ఉద్యమాలకు సిద్ధమవుతున్నామని కవిత హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, మహిళలకు రూ. 2500, ఆడపిల్లలకు స్కూటీలు, మైనారిటీలకు ప్రత్యేక హక్కులు కల్పించేవరకు పోరాటం ఆగదన్నారు. జాగృతి సంస్థలో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్ల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం కూడా ఉద్యమిస్తామని ఆమె స్పష్టం చేశారు. కేసీఆర్ ఒక కన్నైతే, మరో కన్ను జాగృతేనంటూ భావోద్వేగంతో మాట్లాడారు.
Read Also : Miss World 2025 : ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ విజేత ఎవరంటే?