📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు ఇందిరమ్మ ఇళ్లకు సర్కారు శుభవార్త 23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ ఈ రోజు బంగారం ధరలు 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ట్రాఫిక్ టెన్షన్‌కు చెక్.. ఒకే టికెట్‌తో మూడు సేవలు హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు హత్యలు కలకలం! హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 220 ఉద్యోగాలు రైతులకు శుభవార్త చర్మ క్యాన్సర్‌కు కొత్త చికిత్సా పద్ధతి అంతరిక్ష ప్రయాణాలకు సునీతా రిటైర్మెంట్ బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం

Kavitha: రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ 

Author Icon By Saritha
Updated: January 21, 2026 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీల రిజర్వేషన్(42 BC Reservation)  చర్చకు రావొద్దనే గుంటనక్కకు ఫోన్ ట్యాపింగ్ లో నోటీస్ ఇచ్చారని, (Kavitha) గుంపు మేస్త్రీ గుంట నక్క ఇద్దరు కలిసే ఉన్నారని తెలంగాణ(TG) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బీసీలకు 42 % రిజర్వేషన్ డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు జారీ చేసిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కవిత మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఊసే ఎత్తకుండ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు. కేటీఆర్ సికింద్రాబాద్ జిల్లా చేయమనడం పెద్ద జోక్ అన్న కవిత 10 ఏండ్లు అధికారంలో ఉన్నపుడు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.

Read Also: Medaram: జాతరలో ‘మండమెలిగే’ ప్రత్యేక ఘట్టం

The SIT notices were issued solely to divert attention from the reservation issue.

అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం

జిల్లాల పునర్విభజనలో సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.అలాగే ఏదైనా ఒక జిల్లా కు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  పేరు పెట్టాల్సిందేనని కూడా కవిత డిమాండ్‌ చేశారు. త్వరలో కుల గణన కు సంబంధించి రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, గుంపు మేస్త్రీ మీద నాకు నమ్మకం లేదన్నారు. బీసీ ఉప కులాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేస్తామన్నారు.

తెలంగాణ (Kavitha) ఉద్యమకారుడు ముచ్చర్ల సత్యనారాయణ స్పూర్తి తో జాగృతి ముందుకు వెళుతుందన్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలపై కూడా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని.. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరు మద్దతు కోరినా ఇస్తామని కవిత స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు తుదిదశకు చేరుతుందనే నమ్మకం తనకు లేదన్నారు. తనలాంటి బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదని చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలన్నారు. ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహం అక్కడ పెట్టాలని కవిత డిమాండ్‌ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

42 BC Reservation BC Reservation Controversy Kalvakuntla Kavitha Latest News in Telugu SIT Notice Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.