తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha), మేడ్చల్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఘాటు విమర్శలు గుప్పించారు. నిన్న మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ‘జాగృతి జనంబాట’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మల్లారెడ్డి ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా మేడ్చల్‌లో పూలు, పాలు అమ్ముకొని వేల ఎకరాలు కబ్జా చేశారే తప్ప,
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ
పేదలకు చేసిందేమీ లేదని సంచలన ఆరోపణలు చేశారు.ముందుగా జవహర్‌నగర్ డంపింగ్‌యార్డును పరిశీలించిన కవిత (Kavitha),, అనంతరం అంబేద్కర్‌నగర్‌లో బస్తీవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేడ్చల్‌లో అభివృద్ధి జరిగిందని మల్లారెడ్డి చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు.
తన పర్యటనలో తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి కనీస మౌలిక వసతులు కూడా లేవని గుర్తించానని తెలిపారు. నియోజకవర్గంలో సరైన డిగ్రీ, జూనియర్ కళాశాలలు లేకపోవడంతో యువత ఉన్నత చదువులకు దూరమై గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తా
జీవో నం.58, 59 కింద భూముల క్రమబద్ధీకరణ పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ఏళ్లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయలేదని కవిత ఆరోపించారు. అదే సమయంలో మాజీ మేయర్, మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. ఈ అంశంపై అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.
అనంతరం మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపయ్యాయని కూడా ఆమె విమర్శించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: