📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Kavitha: కొత్త పార్టీ దిశగా అడుగులు – ప్రశాంత్ కిశోర్ వ్యూహాత్మక మద్దతు?

Author Icon By Pooja
Updated: January 19, 2026 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్‌కు దూరమైన తర్వాత కల్వకుంట్ల కవిత(Kavitha) తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆమె ప్రయత్నాలు వేగం పెంచినట్లు తెలుస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కార్యాచరణకు సిద్ధమవుతూ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని సమాచారం.

Read Also:TG Government: మేడారం అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలుస్తాయి: సీతక్క

Kavitha: Steps towards a new party – strategic support from Prashant Kishor?

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) నుంచి కవితకు మార్గనిర్దేశనం లభిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీస్తోంది.

తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మార్పు

గత రెండు నెలల కాలంలో ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు హైదరాబాద్‌ వచ్చి కవితతో(Kavitha) గోప్యంగా సమావేశమైనట్లు సమాచారం. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కూడా వీరిద్దరి మధ్య భేటీ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. కొత్త పార్టీ ప్రకటిస్తే రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకెళ్లాలి, అనుసరించాల్సిన వ్యూహాలు ఏమిటి వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలపై కవిత గానీ, తెలంగాణ జాగృతి నాయకత్వం గానీ అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా, తెలంగాణ స్వరూపాన్ని కాపాడేందుకు కొత్త రాజకీయ శక్తి అవసరం అని కవిత స్పష్టం చేస్తున్నారు. తన ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మార్చి, 2029 ఎన్నికల్లో ప్రజల తరఫున పోటీ చేస్తామని ఆమె ఇప్పటికే వెల్లడించారు. ఈ దిశగా పార్టీ విధానాలు, నిర్మాణంపై క్షేత్రస్థాయి అధ్యయనాల కోసం దాదాపు 50 కమిటీలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

అలాగే మైనార్టీలు, బీసీలు, యువత తనతో కలిసి రావాలని, ప్రతిపాదిత ‘తెలంగాణ సెక్యులర్ పార్టీ’కి మద్దతు ఇవ్వాలని ఆమె పిలుపునిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్‌, కేసీఆర్‌, తమిళనాడు నటుడు విజయ్ వంటి నేతలతో పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కవితకు దగ్గర కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత క్షేత్రస్థాయి సన్నాహాలు, పీకే వ్యూహాత్మక సూచనలతో త్వరలోనే కొత్త పార్టీపై స్పష్టత వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Google News in Telugu Latest News in Telugu TelanganaJagruti TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.