తెలంగాణ రాజకీయాల్లో MLC కవిత (Kavitha) వ్యవహారం నానుతూ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలు టీ కప్పులో తుఫాన్‌లా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. “కవిత తండ్రి కేసీఆర్ వద్ద దెయ్యాలేవో ఉన్నాయట. అవేంటో ఆమె స్పష్టంగా చెప్పాలి. ఆమె ఎందుకు నోరు విప్పడం లేదు?” అని ప్రశ్నించారు. ఆమె మాట్లాడిన విషయాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయని తెలిపారు.
BRS – BJP గుట్టు బయటపెడతాం : పొంగులేటి
పొంగులేటి (ponguleti srinivas reddy) వ్యాఖ్యల్లో ప్రధానంగా BRS మరియు BJP మధ్య ఉన్న సంబంధాన్ని ఉద్దేశించారు. “కవిత BRS, BJPల మధ్య సంబంధం ఉందని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు కలిసి నడుస్తున్నాయన్నది ప్రజలకే స్పష్టంగా కనిపిస్తోంది. ఓ BJP ఎమ్మెల్యే కూడా ఇదే విషయాన్ని అంగీకరించారని” మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ మైత్రి అంశం మరోసారి చర్చకు వచ్చి, BRS పార్టీపై ఆరోపణలు మళ్లీ జోరందుకున్నాయి.
భూ కుంభకోణాలపై సీరియస్ చర్యలు
కేవలం వ్యాఖ్యల దాకే కాకుండా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై కూడా మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. “కాళేశ్వరం విషయంలో తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవు. గత ప్రభుత్వంలో భూ బకాసురుల్లా వ్యవహరించిన వారిని బయటకు తీయడం జరుగుతుంది. ప్రజలకు న్యాయం చేయడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, తెలంగాణలో భూ వ్యవహారాలపై విచారణలు ఇంకా ఉత్కంఠ రేపే అవకాశం ఉంది.
Read Also : Telangana : బిఆర్ఎస్ పాలనలో రూ. 3.5లక్షల కోట్ల పెట్టుబడులు – KTR