हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Latest News: Kavitha: జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన కవిత

Anusha
Kavitha
Kavitha

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు, వారి కుటుంబాలకు, అలాగే ఉద్యమంలో ముందుండి పోరాడిన తెలంగాణ కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ తాను క్షమాపణ కోరుతున్నానంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం గన్ పార్కులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి ఆమె, జనం బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Mantha Cyclone: తుఫాను ముప్పు..4 రోజులు కుండపోత వర్షాలు

ఈ సందర్భంగా కవిత (Kavitha) మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో బీఆర్ఎస్ (BRS) పాలనలో తాను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ, అమరవీరుల కుటుంబాలకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చూసే అధికారం తన వద్ద లేకపోయిందని చెప్పింది.

తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నా… మంత్రిగా పదవి అప్పగించబడలేదని, అధికారికంగా నిర్ణయం తీసుకునే సంతకం చేసే అవకాశాలు లేకపోవడంతో అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం పూర్తిగా అందేలా కృషి చేయడంలో పరిమితులున్నాయని ఆమె వివరణ ఇచ్చారు.

కానీ పూర్తిస్థాయి పరిష్కారం రాకపోవడం

అమరవీరుల కుటుంబాల్లో కొందరికి మాత్రమే ప్రభుత్వం నుంచి పరిహారం అందిందని, ఇంకా చాలా కుటుంబాలు నిరీక్షణలోనే ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఈ అంశాన్ని పాలక వర్గాల్లో, ముఖ్యమైన సమావేశాల్లో అనేకసార్లు లేవనెత్తానని, కానీ పూర్తిస్థాయి పరిష్కారం రాకపోవడం తనను బాధపెడుతోందని తెలిపారు.

ఈ విషయంలో తాను తగినంత పోరాటం చేయలేదని, అమరవీరుల కుటుంబాలకు డబ్బులు అందేవరకూ పోరాడాల్సిందని చెప్పారు. అందుకే ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెబుతున్నానని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

ప్రతీ అమరవీరుల కుటుంబానికీ రూ.కోటి చొప్పున అందజేయాలని రేవంత్ రెడ్డి సర్కారును కవిత డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం సాక్షిగా పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఈ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని, లేదంటే ప్రభుత్వాన్ని మార్చైనా సరే ఇప్పిస్తానని కల్వకుంట్ల కవిత ప్రమాణం చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870