📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Telugu News: Kavitha: మాధవరం కామెంట్స్‌కు కవిత స్పందన

Author Icon By Sushmitha
Updated: December 10, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆయన తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయనలోని ఫ్రస్ట్రేషన్‌ను బయట పెడుతోందని కవిత (Kavitha) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తానని వెల్లడించారు. కూకట్‌పల్లిలో తాను 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే ప్రస్తావించానని తెలిపారు. ఎమ్మెల్యే మాటలకు బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.

Read Also: KTR: ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్

Kavitha’s response to Madhavaram’s comments

“జాగృతి జనం బాట”: విద్యా, వైద్యంపై ఫోకస్

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని కవిత తెలిపారు. నేడు కంటోన్మెంట్‌లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్‌ను సందర్శించినట్లు చెప్పారు. ఈ స్కూల్‌ను మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా బాగు చేసినా, అక్కడ కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవని గుర్తించామన్నారు, వాటిని తమ సంస్థ తరఫున ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ స్కూల్లోనే అంగన్‌వాడీని కూడా కలిపారని, కానీ అంగన్‌వాడీలో హెల్పర్లు లేరని ఆమె తెలిపారు. జనం బాటలో భాగంగా తాము విద్య, వైద్యం మీద ప్రధానంగా దృష్టి సారించామని వెల్లడించారు. స్కూళ్లు, హాస్పిటల్స్‌లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తున్నామన్నారు.

సమస్యల పరిష్కారం, ప్రభుత్వాలపై ఒత్తిడి

ఇళ్లు లేని, ఇళ్ల పట్టాలు లేని వారి సమస్యలను కూడా తెలుసుకుంటున్నామని, తమ సంస్థ (జాగృతి) తరఫున చేయగలిగే సహాయాన్ని చేస్తామని కవిత స్పష్టం చేశారు. టాప్ టెన్ విద్యార్థులకు జాగృతి తరఫున స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించారు.

ఏ జిల్లాకు వెళ్లినా ప్రజల నుంచి మంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటోందన్నారు. ప్రజల సమస్యలను వీలైనంతగా పరిష్కరిస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో (ఉమ్మడి రాష్ట్రంలో) తనను నిజామాబాద్‌కే పరిమితం చేశారని, అప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు.

జాగృతి ‘జనం గళం’గా పనిచేస్తుంది

తెలంగాణ (Telangana) వచ్చాక ఏం జరిగింది, ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కవిత తెలిపారు. తాము చేయగలిగినవి చేస్తామని, మిగిలిన సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం పట్టించుకోవట్లేదని, పాలక పక్షం అసలే పట్టించుకోవడం లేదని, అందుకే జాగృతి జనం గళమై పనిచేస్తోందని కవిత పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anganwadi helpers Boyinapally Government School Google News in Telugu Hyderabad district tour Janam Bata program Kukatpally MLA Madhavaram Krishna Rao Latest News in Telugu MLA frustration personal targeting press meet with documents Telangana Jagruthi President Kavitha Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.