హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు(Harish Rao) ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి, తన్నీరు సత్యనారాయణరావు ఈ రోజు ఉదయం మృతి చెందారు. దీంతో తన్నీరు కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలియగానే బీఆర్‌ఎస్ నాయకులు, రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Harish Rao: హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
నివాళులు అర్పించనున్న కల్వకుంట్ల కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హరీష్ రావు తండ్రి మృతికి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ (X) వేదికగా హరీష్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కవిత(Kavitha) హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం. ప్రస్తుతం హరీష్ రావు తండ్రి మరణ వార్త వినగానే ప్రయాణాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు కవిత. ఆమె నేరుగా హరీష్ రావు ఇంటికి చేరుకుని తన్నీరు సత్యనారాయణరావు భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. హరీష్ రావు తల్లి లక్ష్మీబాయి, కవితకు సొంత మేనత్త అన్న విషయం తెలిసిందే.
హరీష్ రావు తండ్రి పేరు ఏమిటి?
తన్నీరు సత్యనారాయణరావు.
సత్యనారాయణరావు మృతికి ఎవరు సంతాపం తెలిపారు?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: