Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

Read Time:  1 min
Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం
FONT SIZE
GET APP

Kavitha: లిక్కర్ స్కామ్ కేసు తీర్పు అనంతరం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీ ఓటమిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also: KTR: లిక్కర్ స్కాం కేసు లో కవితకు క్లీన్ చిట్‌పై కేటీఆర్ స్పందన

Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం
Kavitha: Kavitha is angry over KTR’s comments in the liquor scam case.

కొత్త పార్టీ దిశగా అడుగులు

“బీఆర్ఎస్ ఓడిపోవడానికి నేనే కారణమా? పార్టీ కోసమే కదా నాపై కేసు పెట్టింది? తప్పు తేలకుండానే నా వ్యక్తిత్వ హననం చేశారు” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసు పెట్టినప్పుడు, తనపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు పార్టీ ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత, త్వరలోనే సొంత కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.