📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Kavitha: రేవంత్ రెడ్డిపై కవిత ఫైర్

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హన్మకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వ్యవహార శైలిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను “తాట తీస్తా, తొక్కుతా” అంటూ ముఖ్యమంత్రి హెచ్చరించడాన్ని ఆమె తప్పుబట్టారు. సీఎం వాడిన భాష వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా ఉందని కవిత ఘాటుగా విమర్శించారు.

Read Also: Blue berries: చిన్న పండులో మహా ఆరోగ్య రహస్యం

Kavitha

మాట తప్పింది మీరే: కవిత నిలదీత

‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో పర్యటించిన కవిత, హన్మకొండలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతోనే కాలేజీ యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. మాట తప్పింది మీరు. అలాంటప్పుడు వారి తాట, తోలు తీస్తామని అనడం ఎంతవరకు సమంజసం? తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం నిలబడిన వారిపై మీ వీరంగమా?” అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

యాజమాన్యాలకు అండగా పోరాటం

ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, యాజమాన్యాలను బెదిరించే ధోరణి అవలంబిస్తోందని కవిత(Kavitha) ఆరోపించారు. విద్యార్థుల కోసం పోరాడుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు తాము అండగా ఉంటామని, వారి తరఫున పోరాడతామని ఆమె భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ, బెదిరింపులతో కాదని ఆమె హితవు పలికారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

fee reimbursement Google News in Telugu Kalvakuntla Kavitha kavitha Latest News in Telugu mlc kavitha private colleges Revanth Reddy Telangana telangana jagruthi Telangana politics Telugu News Today Warangal Congress politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.